కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ షురూ

family man season 3 shooting started

ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ షురూ

Family Man Season 3 Shooting Started

family man season 3 shooting started

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ ఈసిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ రెండు సిరీస్ లు రాగా రెండు సిరీస్ లూ ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా... రెండో సిరీస్ ను కూడా తెరకెక్కించారు. ఈ సిరీస్ 2021లో రిలీజ్ అయింది. సిరీస్ 2 లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.

ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 రాబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే కొంత కాలంగా రాజ్ అండ్ డీకే సిటాడెల్ హిందీ వెర్షన్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈసిరీస్ సెట్స్ పైకి రాలేకపోయింది. ఇటీవలే ఆ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయిపోవడంతో ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్3పై ఫోకస్ ను పెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. తాజాగా మూడో సీజన్ కి సంబంధించి షూటింగ్‌ను ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. మూడో సీజన్ రెండు సీజన్లకు మించి ఉంటుందని.. థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. కాగా ఈసిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, శరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్