రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

raayan movie first single release date fixed

ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు అన్నీ ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 9వ తేదీన ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =