ఓటీటీ లోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఎక్కడంటే?

Geethanjali Malli Vachindi OTT Release Date Locked

అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. కాగా ఇది అంజ‌లి కెరీర్‌లో 50వ సినిమా కావడం విశేషం. ప్రముఖ కొరియోగ్ర‌ఫర్ శివ తుర్ల‌పాటి ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించగా.. టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పించారు. అలాగే ఈ సినిమాకి కోన వెంక‌ట్ స్వయంగా క‌థ, స్రీన్ ప్లేను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2014లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‍గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు మరియు ప్రచారచిత్రాలు మూవీపై ఆసక్తిని పెంచగా.. ‘ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి’ అంటూ ప్రేక్షకులకు థ్రిల్ అందించేందుకు ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. మే 8న ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ లోకి వస్తోంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అధికారికంగా వెల్లడించింది. కాగా థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం.

ఇక కామెడీ అండ్ హార్రర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, అలీ, సునీల్‌, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషించారు. కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ద్వారా మ‌ల‌యాళ చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ మాధ‌వ్‌ టాలీవుడ్‌కు ప‌రిచ‌యమయ్యారు.

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ కథ ఏంటంటే..?

తొలిభాగంలో ఉన్నట్లే మరోసారి ఇందులో కూడా శ్రీనివాస్‌ రెడ్డి ద‌ర్శ‌కుడిగానే కనిపించదు. హార్ర‌ర్ సినిమా తీద్దామని అంజ‌లి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబ‌డిన భ‌వంతిలోకి వెళతారు. అయితే ఆ భ‌వంతీలో షూటింగ్ జ‌రుగుతున్న సమయంలో వారికి కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురవుతుంటాయి. ఆ ఇంట్లో మూడు దెయ్యాలు ఉండటం వారు గమనిస్తారు. అయితే ఇవి నిజంగా ఉన్నాయా? లేదంటే వారి భ్రమేనా? వాటిని చూసిన తర్వాత అంజలి అండ్ టీమ్ ఏం చేసింది? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.