ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకుపోతుంది. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం సినిమాలు సూపర్ హిట్లు అయి తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఈసినిమాలు అన్నీ 100, కోట్లు, 200 కోట్లు కలెక్షన్స్ సాధించినవే. వీటి జాబితాలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా చేరిపోయింది. ఫహద్ ఫాజిల్ హీరోగా జీతు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆవేశం. కామెడీ క్రైమ్ థ్రిలర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ముఖ్యంగా ఈసినిమాలో ఫహద్ ఫాజిల్ నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫహాద్ ఫాజిల్ స్వయంగా నిర్మించిన ఈసినిమా వంద కోట్లకై పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. మే 9 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాలంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్కు రానున్నట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో ఆశిష్ విద్యార్ధి ,మన్సూర్ అలీ ఖాన్ , పూజా మోహన్ రాజ , సాజిన్ గోపు కీలక పాత్రల్లో నటించారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించిన ఈసినిమాను హీరోయిన్ నజ్రియా, అన్వర్ రషీద్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























