‘శ్రీదేవి’ జీవిత చ‌రిత్ర‌ పుస్తక ఆవిష్కరణ

A Book on Legendary Actress Sridevi Unveiled,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Legendary Actress Sridevi Book,Actress Sridevi Book,Sridevi New Book,Satyarth Nayak Book Sridevi,Sridevi Girl Woman Superstar

బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి.. వెండి తెరపై తన అందం అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినా.. అతిలోకసుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ నటిగా చెరగని ముద్ర వేసింది శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి దాదాపు రెండేళ్లు కావొస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ఆమె ఆమె జీవితంపై రాసిన పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసారు. ప్రముఖ రచయత సత్యార్ధ్ నాయక్.. ‘శ్రీదేవి: ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ పేరుతో ఈ పుస్తకాన్ని రాసారు. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ముందుమాటను బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ రాసారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది.

శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వ‌ర‌కు ఆమె ఎదుర్కొన్న ప‌రిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత స‌త్యార్థ్ నాయ‌క్ ఈ పుస్తకంలో పొందుపరిచారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.