మైతీ బ్యానర్ లో విజయ్ మూవీ అనౌన్స్ మెంట్

mythri movie makers new movie with vijay deverakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు సినిమా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ ఉంటుంది. ఈమధ్య విజయ్ కు సాలిడ్ హిట్ పడింది లేదు. వరుస ఫ్లాప్స్ మధ్య గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈఏడాది ఫ్యామిలీ స్టార్ తో వచ్చాడు కానీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయినా కూడా విజయ్ దేవరకొండకు అవకాశాలకు మాత్రం కొదువలేదు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనితో పాటు రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో కొత్త సినిమాను ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ పరాజయ తరువాత కూడా దిల్ రాజు మళ్లీ విజయ్ తో చేస్తున్నాడు. ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో మరో సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చేసింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఈసనిమా వస్తుంది. టాక్సీవాలా సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. రిలీజ్ చేసిన పోస్టర్ ను బట్టి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతున్నట్టు అర్థమవుతుంది. పోస్టర్ లో ఓ విగ్రహం ఉండగా.. దానిపై శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని.. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. కేవలం పోస్టర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఈసినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =