డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న అలియా భట్ షూటింగ్ పార్ట్ నిన్నటితో కంప్లీట్ అయినట్టు సమాచారం. RRR మూవీ షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుపుకుంటుంది. ఎన్టీఆర్ కు జోడీగా ఎంపిక చేసిన ఒలీవియా మోరిస్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఆ తరువాత క్లై మాక్స్ చిత్రీకరించి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించి 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ RRR పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: