`అల వైకుంఠ‌పుర‌ములో`… అల్లు అర్జున్ `డ‌బుల్ ధ‌మాకా`?

Stylish Star Allu Arjun To Appear In Double Role In His New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Allu Arjun Upcoming Movie News,Allu Arjun New Movie News,Allu Arjun Latest Movie Details,Allu Arjun Double Role In His Upcoming Film

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్ప‌టివ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసిన సంద‌ర్భాలు లేవు. అయితే, త్వ‌ర‌లోనే ఆ ముచ్చ‌ట కూడా తీర‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… బ‌న్నీ ప్ర‌స్తుతం `అల వైకుంఠ‌పురములో` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోస‌మే బ‌న్నీ డ్యూయెల్ రోల్ లో మెస్మ‌రైజ్ చేస్తాడ‌ని టాక్. కాక‌పోతే, రెండో పాత్ర కేవ‌లం ఐదు నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ట‌. అది కూడా… ఫ్లాష్ బ్యాక్ లో. మ‌రి… ఈ క‌థ‌నంలో నిజ‌మెంతో తెలియాలంటే మాత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

`అల వైకుంఠ‌పుర‌ములో`లో బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా… అల్లు అర‌వింద్, ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 7 =