మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న ‘అల వైకుంఠపురములో’ జనవరి 12న చిత్రాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చూపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తుచేస్తూ రజినీ పై ప్రశంసలు కురిపించారు. సన్నివేశంలో భాగంగా రజనీకాంత్ కుర్చీని దూరంగా విసిరి కొట్టాలి. కానీ కుర్చీ బరువేమో ఎక్కువగా ఉంది. అప్పటికప్పుడు తేలికైన కుర్చీని తీసుకురావడం వీలు కాలేదు. అలాంటి సమయంలో రజనీకాంత్ వచ్చి.. కుర్చీని ఎంత దూరంలో విసిరేయాలి అని అడిగారు.కెమెరా ముందు పడాలి సర్ అని చెప్పాను. ఆ షాట్ ని బరువైన కుర్చీతో రజని కేవలం 2 టేక్స్ లో పూర్తి చేశారు. రజనీకాంత్ ఎనర్జీ లెవెల్స్ కు తాను ఆశ్చర్యపోయానని మురుగదాస్ అన్నారు. మరి దీన్ని బట్టి రజినీ స్టామినా మాత్రం ఏమాత్రం తగ్గలేదన్న సంగతి అర్ధమవుతుంది కదా..
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను దిల్ రాజు, NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: