శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ మూవీస్ విజయం సాధించాయి. ఈ మూవీ వీరి కాంబినేషన్ లో మూడవది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ బ్లాక్ బస్టర్ తడం మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారంలో ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. రామ్ పోతినేని మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ డబల్ ఇస్మార్ట్ మూవీ కి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డబల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్ 2020 సంవత్సరంలో ప్రారంభం కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: