ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లో పూజా హెగ్డే సంద‌డి

Pooja Hegde Hungama In Festival Seasons,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Pooja Hegde Hungama,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest News 2019

ఈ మ‌ధ్య స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. `అర‌వింద స‌మేత‌`, `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`… ఇలా పూజ నాయిక‌గా న‌టించిన మూడు వ‌రుస చిత్రాలు… బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ మోత మోగించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఈ నేప‌థ్యంలో… పూజ త‌దుప‌రి చిత్రాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం పూజ‌… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జోడీగా `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోనూ, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `జాన్‌` (వ‌ర్కింగ్ టైటిల్‌)లోనూ, అఖిల్‌-4లోనూ నాయిక‌గా న‌టిస్తోంది. అలాగే హిందీ చిత్రం `హౌస్‌ఫుల్ 4`లోనూ ఓ హీరోయిన్‌గా న‌టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… పూజ నుంచి రానున్న త‌దుప‌రి రెండు చిత్రాలు కూడా పండ‌గ‌ల‌నే టార్గెట్ చేసుకున్నాయి. హిందీ ఫిల్మ్‌ `హౌస్‌ఫుల్ 4` దీపావ‌ళికి సంద‌డి చేయ‌నుండ‌గా… `అల వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతికి విడుద‌ల కానుంది. మ‌రి… ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లో రాబోతున్న ఈ చిత్రాలు పూజ కెరీర్‌కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 13 =