య‌న్టీఆర్ ‘అగ్గివీరుడు’ కు 50 ఏళ్ళు

50 Years For Sr NTR Aggi Veerudu Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sr NTR Aggi Veerudu Movie Completes 50 Years,Aggi Veerudu Telugu Movie,50 Years of Aggi Veerudu Movie

మహానటుడు యన్.టి.రామారావు, “జానపద బ్రహ్మ” బి.విఠలాచార్యది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్ద‌రి కలయికలో ప‌లు జానపద చిత్రాలు తెరకెక్కగా… వాటిలో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. బి. విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలోనే కాదు.. అయన నిర్మాణంలోనూ య‌న్టీఆర్ కొన్ని జాన‌ప‌ద చిత్రాలు చేశారు. వాటిలో ‘అగ్గివీరుడు’ ఒక‌టి. శ్రీ విఠ‌ల్ కంబైన్స్ పతాకంపై బి.విఠలాచార్య నిర్మించిన ఈ సినిమాకి బి.వి.శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

య‌న్టీఆర్‌ కు జోడీగా రాజశ్రీ నటించిన ఈ చిత్రంలో రామకృష్ణ, సత్యనారాయణ, మిక్కిలినేని, ముక్కామల, రావికొండలరావు, త్యాగ‌రాజు, మీనాకుమారి, విజయలలిత తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సి.నారాయణరెడ్డి, కొసరాజు గీత రచన చేయగా… విజయ కృష్ణమూర్తి స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. “లేడి కన్నులు రమ్మంటే”, “ఎవరో నీవెవరో”, “పిలిచింది అందాల”, “కాకి ముక్కుకి దొండపండు”, “ఆలాంటి దాన్ని”, “సరిసరి మగసిరి” వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. 1969 అక్టోబర్ 17న విడుదలైన ‘అగ్గివీరుడు’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twenty =