ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందరానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. చరణ్ మరో భారీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన ‘లూసిఫర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ మోహన్ లాల్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్న టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రీమేక్ ను కూడా చిరంజీవితోనే చేయనున్నట్టు తెలుస్తుంది. మరి ఇవి కేవలం వార్తలేనా..? ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: