తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ సంస్థలలో గీతా ఆర్ట్స్ కూడా ఒకటని మనకు తెలుసు. ఈ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు తీయగా.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను రూపొందించుచున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో ఫిమేల్ లీడ్ ను కూడా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మన్మధుడు2 సినిమాలో నటించిన అక్షర గౌడ ను ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ పై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురంలో’ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇంకా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మొత్తానికి ఒకపక్క సినిమాలు తీస్తూనే.. మరో పక్క వెబ్ సిరీస్ తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మన నిర్మాతలు. మరి చూద్దాం డిజిటల్ ప్రపంచంలో కూడా చక్రం తిప్పుతారేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: