నిశ్శబ్ధం మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్

Anushka Superb Dedication For Nishabdham,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nishabdham Movie Updates,Nishabdham Telugu Movie Latest News,Anushka Shetty Dedication For Nishabdham,Actress Anushka New Movie News,Heroine Anushka Latest Movie Updates

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న నిశ్శబ్ధం మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన
నిశ్శబ్ధం మూవీ తెలుగు,తమిళ, ఇంగ్లీష్, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

తెలుగు లో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీ నటులతో రూపొందిన నిశ్శబ్ధం మూవీ పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం. ఈ మూవీ లో హీరోయిన్ అనుష్క మూగ చిత్రకారిణిగా నటించారు. ఆ క్యారెక్టర్ కై అనుష్క 6 నెలల పాటు పెయింటింగ్, సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు.
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకొంది. సూపర్ హిట్ భాగమతి మూవీ తరువాత అనుష్క నటించిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here