మొదటి సారి కలిసిరాని అదృష్టం

ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వ సంప్రదాయం అనేది కామన్ థింగ్. తాతలు, తండ్రుల అండతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ లు అయిన వాళ్లు ఉన్నారు. జీరో అయినవాళ్లు కూడా ఉన్నారు. కానీ.. చిన్న హీరో అయినా… పెద్ద హీరో అయినా.. అప్ కమింగ్ హీరో అయినా.. వారసత్వ హీరోలైనా ఎవరి భవిష్యత్ అయినా సరే బాక్సాఫీస్ డిసైడ్ చేయాల్సిందే. అందుకే స్టార్ హీరోలతో పాటు కూడా అప్ కమింగ్ హీరోల రేంజ్ కూడా మారిపోతుంది. దానికి కారణం ఇటీవల వచ్చిన సినిమాలే. పెద్ద సినిమాలను సైతం కాదని.. చిన్న సినిమాలను సైతం అందలం ఎక్కిస్తున్నారు. అందుకే వారసత్వ హీరోలను కాదని.. కొత్త హీరోలను పైకి ఎత్తేస్తున్నారు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకూ మొదటిసారి ఎంట్రీ ఇచ్చి.. వారసత్వం కూడా కలిసిరాని.. మన తెలుగు హీరోల మొదటి సినిమాలు ఏంటో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున – విక్రమ్

అక్కినేని నాగేశ్వర్రావు తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు నేటి మన్మథుడిగా పిలుచుకుంటున్న అక్కినేని నాగార్జున. విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగ్ కు ఈ సినిమా పెద్దగా కలిసిరాలేదు. అప్పట్లో తన ఫిజిక్ పై కామెంట్లు కూడా పడ్డాయి. ద లెజెంట్ యాక్టర్ అయిన అక్కినేని నాగేశ్వర్రావు తనయుడు అయినా కూడా ప్రేక్షకులు ఫ్లాప్ నే ఇచ్చారు. ఇక ఆతరువాత ఎన్నో హిట్లు.. ఫ్లాప్ లతో గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలు చేస్తూ.. అగ్రహీరోల జాబితాల్లోకి వచ్చారు.

పవన్ కళ్యాణ్ – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్.. ఏ హీరోకు లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కు.. మొదటి సినిమా పరాజయాన్నే మిగిల్చింది. మెగాస్టార్ చరిష్మా కూడా ఈసినిమకు కలిసిరాలేదు. ఆ తరువాత తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో ఎవరూ అందుకోలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకొని.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యాడు.

జూనియర్ ఎన్టీఆర్ – నిన్ను చూడాలని

తాత నందమూరి తారకరామారావు అంశగా… నందమూరి హరికృష్ణ తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కు కూడా ఈ వారసత్వం కలిసిరాలేదు.

ప్రభాస్ – ఈశ్వర్

ప్రస్తుతం టాలీవుడ్ లో బాహుబలిగా పిలుచుకుంటున్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కూడా మొదటి సినిమా ఫ్లాపే. కృష్ణం రాజు తరువాత.. నెక్ట్స్ జనరేషన్ ఉప్పలపాటి వారసత్వంలో వచ్చిన హీరో ప్రభాస్. తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మాత, పెద్దనాన్న ఆనాటి స్టార్ హీరో అయినా కూడా మొదటి సినిమాకు అవేమీ కలిసిరాలేదు. ఇప్పుడు స్టార్ హీరోగా జాతీయ స్థాయిలో దూసుకుపోతున్నాడు.

సుమంత్ – ప్రేమకథ

రామ్ గోపాల్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా పరిచయమైన సినిమా ప్రేమకథ. అక్కినేని అనే బ్రాండ్ తో వచ్చిన ఈ హీరోకి ప్రేమకథ పెద్దగా సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయింది.

గోపిచంద్ – తొలి వలపు

ఒకప్పటి దర్శకుడు, నిర్మాత టి.కృష్ణ వారసత్వాన్ని తీసుకొని తెలుగు తెరకు పరిచయమయ్యాడు గోపిచంద్. మొదట విలన్ రోల్స్… హీరోగా చేసి.. అ తరువాత హీరోగానే సెటిల్ అయ్యాడు. ఈ హీరో విషయంలో కూడా మొదటి సినిమాకు బ్యాడ్ లక్కే వరించింది. తొలిచూపులోనే అనే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

కళ్యాణ్ రామ్ – తొలి చూపులోనే

బాలనటుడిగా రెండు మూడు సినిమాల్లో నటించి… తొలిచూపులోనే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కళ్యాణ్ రామ్ కు కూడా మొదటి సినిమాకు లక్ కలిసిరాలేదు.

సాయి తేజ్ – పిల్లా నువ్వులేని జీవితం

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ముద్దుల మేనల్లుడు సాయి తేజ్. నిజానికి ఈ హీరోది ముందు రేయ్ అనే సినిమా విడుదలవ్వాలి. కానీ అప్పుడు ఆగిపోవడంతో పిల్లా నువ్వు లేని జీవితం రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. మెగా పవర్ ఈ సినిమాకు ఏమాత్రం కలిసిరాలేదు. రేయ్ సినిమా ముందు రిలీజ్ అయినా పెద్దగా ఉపయోగం ఏం లేదనుకోండి. అది కూడా ఫ్లాపే అయింది. ఇక ఇటీవలే చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

అల్లు శిరీష్ – గౌరవం

గీతా అర్ట్స్ ఎంత పెద్ద బ్యానరో.. అల్లు అరవింద్ ఎంత పెద్ద ప్రొడ్యూసరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తన తండ్రి అండతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తను నటించిన గౌరవం సినిమా కూడా అల్లు శిరీష్ కు కలిసిరాలేదు.

మంచు విష్ణు – విష్ణు

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడిగా విష్ణు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విష్ణు. కానీ ఈ సినిమా ఫ్లాప్ నే మిగిల్చింది. ఆ తరువాత కొన్ని సినిమాలు హిట్ కొట్టినా.. మళ్లీ వరుస పరాజయాలతో వెనుకబడిపోయాడు విష్ణు.

సుషాంత్ – కాళిదాసు

అక్కినేని కుటుంబంలో నుండి వచ్చిన మరో హీరో సుషాంత్. నాగ చైతన్య, అఖిల్ కంటే ముందుగానే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోకు కాళిదాసు సినిమా అంత విజయాన్ని తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత కూడా ఈ హీరోకి మంచి హిట్ తెచ్చి పెట్టిన సినిమాలు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు.

ప్రకాష్ కోవెలమూడి – నీతో

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు అగ్రతారలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అలాంటి లెజెండరీ డైరెక్టర్ కొడుకుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ప్రకాష్ కోవెలమూడి. కానీ ఎంతో మందికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన రాఘవేంద్రరావు కొడుకుకి మాత్రం హిట్ దక్కలేదు. కేవలం ఒక్క సినిమాతోనే నటనకు దూరమై దర్శకత్వం వైపు వెళ్లాడు. అక్కడ కూడా ప్రకాష్ కు కలిసిరాలేదు. తన మొదటి సినిమా అనగనగా ఓ ధీరుడు సినిమా కూడా ఫ్లాపే అయింది.

నాగ చైతన్య – జోష్

అక్కినేని కమ్ దగ్గుబాటి వారసుడు నాగచైతన్య. ఒకపక్క ఆనాటి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్రావు, లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు ల మనవడు… అగ్ర హీరోల్లో ఒకడైన నాగార్జున తనయుడు నాగార్జున తనయుడు నాగచైతన్య. అలాంటి హీరో మొదటి సినిమాపై ఎలాంటి అంచనాల ఉంటాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది నాగచైతన్య మొదటి సినిమా జోష్. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత వచ్చిన ఏ మాయ చేశావో సినిమాతో మళ్లీ ఆదే బాక్సాఫీస్ ను కలెక్షన్లతో షేక్ చేశాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మంచి ఫామ్ లోనే ఉన్నాడు.

సుధీర్ బాబు – ఎస్ఎమ్ఎస్

మహేష్ బాబు తరువాత ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో సుధీర్ బాబు. ఇప్పుడు మంచి హిట్లతో కెరీర్ ను గాడిలోకి తెచ్చుకున్న సుధీర్ బాబు కు మొదటి సినిమా మాత్రం పరాజయాన్నే మిగిల్చింది. ఎస్ఎమ్ఎస్ సినిమా ఈ హీరోకు ఫ్లాప్ నే తెచ్చిపెట్టింది.

వరుణ్ తేజ్ – ముకుంద

పెదనాన్న ఏమో మెగాస్టార్ చిరంజీవి. తండ్రేమో నటుడు ప్లస్ నిర్మాత. అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన మరో మెగా హీరో వరుణ్ తేజ్. మెగా పవర్ తో ముకుంద సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ మెగా పవర్ కలిసిరాలేదు. సినిమా ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంది. కానీ ఆతరువాత మాత్రం వరుణ్ వైవిద్యమైన కథలు చేసుకుంటూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.

సుమంత్ అశ్విన్ – తూనీగ తూనీగ

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా పనిచేసిన ఎమ్ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్. తన తనయుడి మొదటి సినిమాకు తానే దర్శకత్వం వహించి తూనీగ తూనీగ అనే సినిమాను తెరకెక్కించాడు. ఎంతో మంది హీరోలకు మంచి హిట్స్ ఇచ్చిన ఈ నిర్మాత కమ్ డైరెక్టర్ కొడుకు సినిమాకు మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక నాన్న అండతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కు పరాజయమే దక్కింది.

కళ్యాణ్ దేవ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో యంగ్ హీరో కళ్యాణ్ దేవ్. మామ మెగాస్టార్ చిరంజీవి, బావలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఇంకా సాయి ధరమ్ తేజ్ ల సపోర్ట్ తో విజేత సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా మాత్రం విజయాన్ని ఇవ్వలేక పోయింది.

అఖిల్ – అఖిల్

నిజంగా అఖిల్ కు ఉన్న బ్యాడ్ లక్ ఎవరికీ లేదేమో. నాగార్జున తనయుడిగా అఖిల్ టైటిల్ తోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరోకు అదృష్టం కలిసిరాలేదు. మొదటి సినిమాకే కాదు.. ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్. మజ్ను వరకూ ఈ బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. మరి వచ్చే సినిమాకైనా అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా చేస్తాడేమో చూద్దాం.

మేఘాంష్ – రాజ్ దూత్

శ్రీహరి తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కుర్ర హీరో మేఘాంష్, రియల్ హీరో శ్రీహరి కొడుకు అన్న సాఫ్ట్ కార్నర్ అయితే ఈ కుర్ర హీరోపై ఉంది. అందుకే చాలా మంది సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ సపోర్ట్ గా నిలిచారు. అయితే సినిమాలో కాస్త కంటెంట్ ఉంటే బావుండేది.. హీరో గా మేఘాంష్ కు మంచి ప్రశంసలు దక్కినా… సినిమాకు మాత్రం పరాజయాన్నే మిగిల్చింది.

ఆకాష్ పూరీ – ఆంధ్రాపోరీ

ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరీ.. తన తనయుడికి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు. ఒక హీరోని ఎలా చూపించాలి.. హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలి అన్న విషయాలు పూరీ కి తెలిసినంత మరే డైరెక్టర్ కు తెలియదని చెప్పొచ్చు. అలాంటి పూరీ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆకాష్ పూరీ. ఆంధ్రాపోరీ సినిమాతో అరంగేట్రం చేసిన ఆకాష్ పూరీ కి మొదటి సినిమా పరాజయాన్నే మిగిల్చింది. తరువాత పూరీ డైరెక్షన్ లో వచ్చిన మెహబూబా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

రోషన్ శ్రీకాంత్ – నిర్మలా కాన్వెంట్

ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడు ఎవరంటే శ్రీకాంత్ అని చెప్పొచ్చు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సినీ ప్రేక్షకులకు అందించాడు. తన తనయుడు రోషన్ ను కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరో మొదటి సినిమా కూడా ఫ్లాప్ అయింది.

ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ మోస్ట్ వాంటెట్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ ఫ్యామిలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన అన్న సపోర్ట్ లేకుండా దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈహీరోకు కూడా అదృష్టం కలిసిరాలేదు. నటనపరంగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

[subscribe]

[youtube_video videoid=dHKaIUusMr4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =