1975 సంవత్సరంలో దేవుడు చేసిన పెళ్ళి మూవీ లో బాలనటుడిగా టాలీవుడ్ కు ఎంటరయిన సాయికుమార్ 2019 మహర్షి మూవీ లో నటించి 44 సంవత్సరాల సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. తెలుగు, కన్నడ మూవీస్ లో హీరోగా వెలుగొందిన సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరుగా మారారు. సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన కన్నడ మూవీ పోలీస్ స్టోరీ ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి. పోలీస్ స్టోరీ మూవీ కి సీక్వెల్ మూవీస్ కూడా రూపొందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పోలీస్ స్టోరీ మూవీ లో సాయికుమార్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఆ మూవీ లో సాయికుమార్ డైలాగ్ “కంటికి కనిపించే మూడు సింహాలు సత్యానికి, ధర్మానికి ప్రతి రూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ “, సాయి కుమార్ పేరు వినగానే గుర్తొచ్చే డైలాగ్ గా పాప్యులర్ అయింది. విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పలు తెలుగు మూవీస్ విజయం సాధించాయి. సాయి కుమార్ తమిళ
భాషా చిత్రాలలో కూడా నటించారు. ప్రముఖ హీరోలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రాజశేఖర్, సుమన్, అర్జున్ నటించిన చిత్రాలకు వాయిస్ నిచ్చారు. టివి ప్రెజంటర్ గా పలు ప్రోగ్రామ్స్ చేశారు. ప్రస్థానం మూవీ కి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్, సామాన్యుడు మూవీ కి నంది అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్, రంగి తరంగ కన్నడ మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాయి కుమార్ అందుకొన్నారు.
[youtube_video videoid=b9yoW0d_SdE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: