ఈ వేసవికి విడుదలైన ‘మజిలీ’తో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా… తన కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్ వసూళ్ళు చూశాడు యువ సామ్రాట్ నాగచైతన్య. ప్రస్తుతం తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలసి ‘వెంకీమామ’ చేస్తున్నాడు చైతూ. ఈ చిత్రం తరువాత తన తండ్రి ‘కింగ్’ నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’లో నటించనున్నాడు చైతూ. అంతేకాదు… మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌లో చైతూ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట చైతూ. అంతేకాదు… ఈ చిత్రంలో చైతూ సరసన ‘ఫిదా’ భామ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనుందట. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల… ఇప్పటికే ఈ ఇద్దరితో కథా చర్చలు జరిపాడనీ, ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఈ ఇద్దరికీ వినిపించిన తరువాత అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా చేయనున్నాడని టాక్. అలాగే… ఈ ఆగస్టులో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా… ఇటీవల ప్రారంభమైన ‘విరాటపర్వం’ సినిమాలో రానాతో కలసి నటిస్తోంది సాయిపల్లవి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెరపైకి రానుండగా… చైతూ నటిస్తున్న ‘వెంకీమామ’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=rpeIYpLuiE0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: