యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తమిళ సూపర్ హిట్ మూవీ 96, తెలుగు లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. థాయ్ ల్యాండ్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ స్కై డైవింగ్ ఎపిసోడ్ లో శర్వానంద్ కు ప్రమాదం జరిగింది. భుజానికి బలమైన గాయం అయింది. హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో శర్వానంద్ కు 11గంటలపాటు సర్జరీ జరిగింది. రెండు నెలలపాటు షూటింగ్స్ లో పాల్గొనకుండా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుధీర్ వర్మ దర్శకత్వం లో హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన రణరంగం మూవీ ఆగస్ట్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. శర్వానంద్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. డబ్బింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. ఇక ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 96 తెలుగు రీమేక్ మూవీ దసరా కు రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్. ఈ రెండు సినిమాల రిలీజ్ కు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న శర్వానంద్ కొన్ని రోజులలో డిశ్చార్జ్ కానున్నారు గాయం నుండి శర్వానంద్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
[youtube_video videoid=t25tZc8vk7g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: