భూమిక చావ్లా… నిన్నటి తరం అగ్ర కథానాయిక. `యువకుడు`తో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసిన భూమిక… ఆపై ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘనవిజయాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఓ వైపు డ్యూయెట్లు పాడుకునే కమర్షియల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే… మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ‘మిస్సమ్మ’, ‘అనసూయ’తోనూ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్లి తర్వాత కాస్త జోరు తగ్గించిన భూమిక… ‘ఎం.సి.ఎ’తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా న్యూ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ తరువాత ‘యూటర్న్’, ‘సవ్యసాచి’ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. కాగా… క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా భూమికకు ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాల్లోనే నటించే అవకాశాలు ఎక్కువగా వస్తుండడం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే `యూ టర్న్`(తెలుగు), `ఖామోషి` (హిందీ) వంటి థ్రిల్లర్ మూవీస్‌లో కనిపించిన భూమిక… విడుదలకు సిద్ధమైన మరో థ్రిల్లర్ మూవీ`కొలైయుదిర్ కాలమ్`లోనూ కీలక పాత్ర పోషించింది.
అంతేకాదు… తాజాగా ఇంకో థ్రిల్లర్ మూవీకి ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తమిళంలో రూపొందుతున్న ఆ చిత్రమే ‘కన్నై నంబాదే’. ఇందులో భూమిక కథను మలుపు తిప్పే పాత్రలో దర్శనమిస్తుందని సమాచారం.
మొత్తమ్మీద… భూమిక తీరు చూస్తుంటే కేవలం థ్రిల్లర్ మూవీస్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.
[youtube_video videoid=PU-40gl9XuI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: