ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలకు కాలం కలిసిరానట్టుగా ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు… వరుసగా అందరూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయపడటం నుండి మొదలైన పరంపరం.. నిన్న శర్వానంద్ వరకూ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, గోపీచంద్, నాని, వరుణ్ తేజ్, నాగశౌర్య, సందీప్ కిషన్, శర్వానంద్ ఇలా యంగ్ హీరోలందరూ సినిమా షూటింగుల్లో ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. ఇక హీరోలకు గాయాలవుతుండటంతో షూటింగ్ లకు బ్రేక్ వేయాల్సివస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదట ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో రామ్ చరణ్ కు ఎన్టీఆర్ కు గాయాలవడంతో రాజమౌళి షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ వేశారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకోవడం మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు.
ఇక యాక్షన్ హీరో గోపిచంద్ కు కూడా ‘చాణక్య’ సినిమా షూటింగ్ లో భాగంగా గాయాలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా బైక్ పై ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోపీచంద్ గాయపడ్డాడు. ఇది జరిగి మూడు నెలలు పైనే అయిపోయింది. ప్రస్తుతం గోపీచంద్ కూడా ఈ గాయలనుండి కోలుకోవడంతో మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు.
‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ లో భాగంగా న్యాచురల్ స్టార్ నాని కూడా గాయపడ్డాడు. షూటింగ్ సమయంలో నాని కాలికి గాయమవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు నాని.
ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే ఎలాంటి గాయాలు తగలలేదు కానీ.. పెద్ద ప్రమాదమే తప్పింది. ‘వాల్మీకి’ షూటింగ్ కోసం వరుణ్ హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతుండగా.. మార్గమధ్యలో ఆయన కారుకు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి దెబ్బలు తగలలేదు.
‘అశ్వద్ధామ’ సినిమా షూటింగ్ కోసం విశాఖ వెళ్లిన నాగశౌర్య అక్కడ 15 అడుగుల ఎత్తున్న ఓ ఇంటి నుంచి మరో ఇంటి పైకప్పు పైకి దూకబోయి స్లిప్ అయ్యాయి. అతడి కాలికి పెద్ద దెబ్బ తగిలింది. 40 రోజుల పాటు డాక్టర్లు మంచం దిగొద్దని సూచించారు. దీంతో షూటింగ్ బ్రేక్ పడింది.
‘తెనాలి రామకృష్ణ’ షూటింగ్ లో భాగంగా సందీప్ కిషన్ కూడా గాయపడ్డాడు. కర్నూలులో షూటింగ్ కోసం బ్లాస్టింగ్ సీన్‌లో పాల్గొంటూ ఉండగా బాంబ్ పేలి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతికి గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించి… ఆ తరువాత హైదరాబాద్ కు తరలించారు.
ప్రస్తుతం శర్వానంద్ తమిళ్ రీమేక్ 96లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ స్కైడైవింగ్ సీన్ చేయబోయిన శర్వానంద్ పట్టు తప్పి కింద పడిపోయాడు. దీంతో భుజానికి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ కారణంగా 96 సినిమా షూటింగ్.. నెల రోజుల పాటు ఆగిపోయే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=S5PEZB-aCes]
.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: