‘3 ఇడియట్స్’(2009), ‘తలాష్: ది ఆన్సర్ లైస్ విత్ ఇన్’(2012) వంటి హిందీ చిత్రాలలో జంటగా నటించి అలరించారు అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్. ఇప్పుడు ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జట్టు కట్టనున్నట్టు బాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… 1994లో ఘన విజయం సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ని ‘లాల్ సింగ్ చద్దా’ పేరుతో హిందీలో రీమేక్ చేయనున్నారు. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో కథానాయికగా నటించే అవకాశం కరీనాకి దక్కిందని సమాచారం. త్వరలోనే కరీనా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా… ఈ ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ‘లాల్ సింగ్ చద్దా’ను… 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. మరి.. `3 ఇడియట్స్`తో సెన్సేషన్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న అమీర్, కరీనా మరోసారి ఆనాటి మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: