`గ్లాడియేటర్`(2000)… 19 ఏళ్ళ క్రితం హాలీవుడ్‌లో ఓ సంచలనం. వీరాధివీరులైన బానిసలను వేట జంతువుల్లా పరిగణిస్తూ రారాజులు, చక్రవర్తులు వారి ప్రాణాలతో ఎలా ఆడుకున్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ… ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపించింది. అంతేకాదు, ఐదు ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కాగా, రస్సెల్ క్రో ప్రధాన పాత్రలో రిడ్లీ స్కాట్ రూపొందించిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్లాడియేటర్ కథ ముగిసాక పాతికేళ్ళ తరువాత ఏం జరిగింది? తొలి భాగంలో ల్యూసిల్లా పాత్ర పోషించిన నీల్సన్ కొడుకు ల్యూషియన్ పెద్దవాడయ్యాక ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కొనసాగింపు చిత్రం ఉంటుందని హాలీవుడ్ టాక్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన రిడ్లీ స్కాట్ ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహిస్తుండగా.. పీటర్ క్రెయిగ్ స్క్రిప్ట్‌ని అందిస్తున్నాడు. మరి.. మొదటి భాగంలాగే `గ్లాడియేటర్` సీక్వెల్ కూడా సంచలనాలకి కేంద్ర బిందువుగా నిలుస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=BRn3-Vyu_iM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: