`మ‌న్మ‌థుడు 2`కి రాహుల్ సెంటిమెంట్‌

2019 Latest Telugu Movie News, Rahul Ravindran Following Sentiments for Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest Updates, Manmadhudu 2 Movie Shooting News,Nagarjuna Akkineni Upcoming Movies, Nagarjuna Akkineni new movie Manmadhudu 2, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Rahul Ravindran Following Sentiments for Manmadhudu 2

క‌థానాయ‌కుడిగా ప‌లు చిత్రాల్లో సంద‌డి చేసిన యంగ్ హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్‌… ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా బిజీ అయిపోయాడు. గ‌త ఏడాది విడుద‌లైన `చి.ల.సౌ`తో డైరెక్ట‌ర్‌గా తొలి అడుగులు వేసిన రాహుల్‌… ప్రస్తుతం కింగ్ నాగార్జున‌తో `మ‌న్మథుడు 2` చేస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల మందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో… ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `మ‌న్మ‌థుడు 2`పై రాహుల్ భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. అంతేకాదు, త‌న‌కు క‌లిసొచ్చిన ఓ సెంటిమెంట్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే నమ్మ‌కంతో ఉన్నాడు. ఇంత‌కీ అదేమిటంటే.. `చి.ల.సౌ` గ‌త సంవ‌త్స‌రం ఆగ‌స్టు ప్ర‌థ‌మార్ధం (ఆగ‌స్టు 3)లో విడుద‌లై విజ‌యం సాధించ‌గా… ఇప్పుడు అదే ఆగ‌స్టు ప్ర‌థ‌మార్ధం (ఆగ‌స్టు 9)లో `మ‌న్మ‌థుడు 2` రాబోతుంది. మ‌రి ఆగ‌స్టు ఫ‌స్టాఫ్ సెంటిమెంట్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అయి… రాహుల్‌కి గుర్తుండిపోయే విజ‌యం ద‌క్కుతుందేమో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=j7B34XDQ3Bo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =