లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఈ టైటిల్ ను ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటినుండి ఈ సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దానికి తోడు వర్మ తన సినిమాను మాములుగా ప్రమోషన్ చేయడుగా..సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ దానిపై ఏదో ఒక చర్చ జరగాల్సిందే. ఇక ఇన్నిరోజులు తనదైన శైలిలో ప్రమోషన్ చేసిన వర్మ మరోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జనాల్లో ఉన్న క్రేజ్ గురించి చెబుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా రిలీజ్ పై ఇన్ని రోజులు గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమాలో చంద్రబాబు నాయుడుని నెగెటివ్ గా చూపించారని టీడీపీ కార్యకర్తలు సినిమాను ఆపే ప్రయత్నం చేశారు. కానీ అటు ఈసీ.. ఇటు సెన్సార్ బోర్డ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో మార్చి 29వ తేదీనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఇంట్రెస్ట్ సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లో కేవలం 10 నిమిషాల్లో 1000 టికెట్స్ బుక్ అయ్యాయట. ఈ విషయాన్ని కూడా వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ”ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు మహానాయకుడు కన్నా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అంతేకాదు నిజమైన ఎన్టీఆర్ అభిమానులంటే మీరంటూ ప్రశంసలు కురిపించారు. మరి చూద్దాం వర్మ ప్రమోషన్స్ వల్ల ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..?
ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే😎 కథానాయకుడు మహానాయకుడు కన్నా 🙄లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, 😜అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు💪💪💪. జై బాలయ్య💐💐💐 pic.twitter.com/sZnczj7WMb
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2019
[youtube_video videoid=eZNZjmZ_sUA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: