గీతాంజలి, త్రిపుర వంటి హార్రర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాజ కిరణ్. ఇప్పుడు నందితా శ్వేత, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ ప్రధాన పాత్రల్లో మరోసారి అలాంటి జోనర్ లోనే విశ్వామిత్ర అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈసినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
కాగా రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కెమెరా..అనిల్ బండారి.
మరి ప్రేమకథా చిత్రమ్ సినిమాతో తెలుగు పరిచయమైన నందితా ఆ సినిమాతో మంచి విజయం దక్కించుకుంది. ఆ తరువాత నందితకు మంచి సక్సెస్ దక్కలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో భయపెట్టడానికి వస్తుంది. మరి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ థ్రిల్లర్ సినిమా నందితకు సక్సెస్ అందిస్తుందో?లేదో? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=O09oFtdivZU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: