సమంత ప్రధాన పాత్రలో కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను… సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓ అతిథి పాత్రలో అడివి శేష్ కూడా కనిపించనున్నట్టు సమాచారం.
మరి గత ఏడాది `రంగస్థలం`, `మహానటి`, `యూ టర్న్` వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించిన సమంత ఇప్పుడు ఓ బేబి సినిమాలో మరో డిఫరెంట్ రోల్ తో వస్తుంది. దానితో పాటు తన భర్త నాగచైతన్యతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మజిలీ` లో కూడా నటిస్తుంది. మరి ఈ ఏడాది సమంతకు ఎలా కలిసొస్తుందో చూద్దాం?
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: