ఒక మనసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించి మరోసారి అలరించింది మెగా హీరోయిన్ నిహారిక. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఇప్పుడు డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా సూర్యకాంతం అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే పోస్టర్స్, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు టాలీవుడ్ నుండి పాజిటివ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని.. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని.. ఖచ్చితంగా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా మరో పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడినట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు దిల్ రాజు. చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు.. అసలు సినిమాలో మ్యాటరెంత ఉందని చూసే ప్రొడ్యూసర్ దిల్ రాజు. అటు నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయనకు సినిమా నచ్చిందంటే తనే రైట్స్ కొని రిలీజ్ చేస్తాడు. ఇటీవల రిలీజై మంచి సక్సెస్ అందుకున్న 118 సినిమానే దీనికి నిదర్శనం. 118 సినిమా చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు నైజాం తో పాటు ఉత్తరాంధ్ర రైట్స్ కూడా కొని రిలీజ్ చేశారు. కట్ చేస్తే సినిమా హిట్. ఇప్పుడు సూర్యకాంతం సినిమాను కూడా దిల్ రాజే రెండు తెలుగు రాష్ట్రల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దిల్ రాజు ఈ సినిమాను తీసుకున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే. నిహారిక ఫస్ట్ హిట్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై సందీప్ యెర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=UZq_r5DUy9I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: