కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ ను చూస్తే ఫుల్ కామెడీతో ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ ర్యాంక్ రాజు – విద్య 100% బుద్ధి 0% అని పెట్టిన ట్యాగ్ లైన్ లాగానే సినిమాలో హీరో చేసిన కామెడీ హైలెట్ గా నిలిచింది. నరేష్, ప్రియదర్శి కూడా తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఇక కామెడీ కింగ్ బ్రహ్మనందం కూడా చాలా రోజుల తరువాత మళ్లీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యారు. మరి టీజర్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది.. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
[youtube_video videoid=F97qoYMuskg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: