‘వినాయకుడు’.. ‘కేరింత’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రూపొందుతోంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఆది పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది నటించనున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన ప్రముఖ రైటర్ అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ చేతుల మీదుగా అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ‘ఘాజీబాబా’పాత్రలో కనిపించనున్నాడు. అబ్బూరి రవి లుక్ ఆకట్టుకునేలా .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా వుంది.
కాగా వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆదికి ఎంత వరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
[youtube_video videoid=WbtiDxR1DZY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: