మహి. వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై.. ముఖ్యంగా వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి అయితే సేమ్ వైఎస్ లాగానే కనిపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వావలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఆ టైంలో సినిమాలు కూడా పెద్దగా లేకపోవడం… యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయుకుడు పార్ట్ లకు సరైస టాక్ రాకపోవడంతో యాత్ర సినిమాకు బాగా కలిసొచ్చింది. తక్కువ బడ్జెట్ లో సినిమాని నిర్మించటం కూడా కలిసొచ్చింది. ఇక ఇన్ని రోజులు సక్సెస్ ఫుల్ ఆడిగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోయింది. దీంతో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* నైజాం – 1.55 కోట్లు
* సీడెడ్ – 1.61 కోట్లు
* నెల్లూరు – 0.41 కోట్లు
* కృష్ణా – 0.61 కోట్లు
* గుంటూరు – 1.12 కోట్లు
* వైజాగ్ – 0.57 కోట్లు
* ఈస్ట్ గోదావరి – 0.32 కోట్లు
* వెస్ట్ గోదావరి – 0.42
* టోటల్ ఏపీ/తెలంగాణ షేర్ – రూ.6.61 కోట్లు
* కేరళ – 0.70 కోట్లు
* యూఎస్ – 0.95 కోట్లు
* మిగతా ప్రాంతాలు 0.55 కోట్లు
* టోటల్ వరల్డ్ వైడ్ షేర్ – రూ .8.81 కోట్లు
[youtube_video videoid=fdc0DiFHMzM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: