సిరివెన్నెలతో ప్రియమణి రీఎంట్రీ

ఎన్ని సినిమాలు చేసినా దక్కని అరుదైన జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నటి ప్రియమణి. టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రియమణి వివాహానంతరం నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న “సిరివెన్నెల” అనే చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగు చిత్ర సీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె కీలకపాత్రలో నటించనుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఇంకా ఈసినిమాలో ప్రియమణితో పాటు.. జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు నటించారు.

ఇంకా డైరెక్టర్ ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ… సిరివెన్నెల మూవీ టాకీ పార్ట్ పూర్తయ్యింది. బ్యాలెన్స్ రెండు పాటలున్నాయి. కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల అనే గొప్ప సినిమా తీశారు. మా సినిమా జోనర్ వేరు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ సిరివెన్నెల. కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి గారు మా సినిమా చేస్తున్నారు. ఆమె కొత్త లుక్ లో కనిపిస్తారు. థ్రిల్లర్ హార్రర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుంది. కాలకేయ ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. మహా నటి ఫేమ్ సాయి తేజ మంచి పాత్ర చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మా షూటింగ్ ఇంత బాగా జరిగిందంటే మా నిర్మాతలు కమల్, బాషా, రాం సీతా గారి వల్లే. అని అన్నారు

ప్రియమణి మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న వయసులో సాయి తేజ మంచి పాత్ర చేస్తుంది. మా డైరెక్టర్ చాలా కూల్. ప్రభాకర్ చాలా మంచి క్యారెక్టర్ చేశారు. మా నిర్మాతలకు చాలా థాంక్స్. సూపర్ నేచురల్ సంబంధ విషయాలు నేర్చుకునే ప్రాసెస్ లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్ థ్రిల్లింగ్ గా చెప్పారు. అని అన్నారు.

కాలకేయ ప్రభాకర్ మాట్లాడుతూ… కన్నింగ్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ చేశా. చాలా మంచి పాత్ర. కామెడీ కూడా చేశాను. డబ్బింగ్ చెప్పాను సినిమా బాగా వచ్చింది. ప్రియమణి గారితో కలిసి నటించే అవకాశం వచ్చిందన్నారు. అని అన్నారు.

నిర్మాత భాషా మాట్లాడుతూ…. కీరవాణి గారి దగ్గర నేను బాహుబలి 2 వరకు మేనేజర్ గా పని చేసాను. మా నిర్మాత కమల్ గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. మా తొలి సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. అని అన్నారు.

[subscribe]

[youtube_video videoid=fi-co2OfFYo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =