సూపర్ స్టార్ మహేష్ బాబు… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు… యాడ్ వరల్డ్‌లోనూ స్కై ఈజ్ లిమిట్ అన్నట్లుగా దూసుకుపోతున్నాడీ ప్రిన్స్. అలాంటి మహేష్‌కి… 2019 కెరీర్ పరంగా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే… ఒకే సంవత్సరంలో కెరీర్ పరంగా రెండు మైలురాళ్ళకు చేరుకుంటున్నాడీ తెలుగు తెర రాజకుమారుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… బాలనటుడిగానే స్టార్ డమ్‌ని పొందిన మహేష్… 1999లో కథానాయకుడిగా తొలిసారిగా అడుగులు వేశాడు. మహేష్ కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా `రాజ కుమారుడు` విడుదలై… ఈ ఏడాది జూలై 30కి 20 ఏళ్ళు పూర్తవుతోంది. అంటే… హీరోగా మహేష్ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంటున్నాడన్నమాట. ఇక… ఈ ఏప్రిల్ 25న రానున్న `మహర్షి`తో కథానాయకుడిగా 25 చిత్రాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. మొత్తానికి… 2019లో రెండు మైలురాళ్ళకి చేరుకుంటూ అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్న మహేష్… `మహర్షి`తో మరో కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవాలని ఆశిద్దాం.
[youtube_video videoid=GPU0CAGGzAU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: