దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందో? లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని మణిరత్నం, రావు రమేష్ తదితరులు
డైరెక్టర్: మహి.వి.రాఘవ్
బ్యానర్: 70 MM ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: కె. కృష్ణ కుమార్
ఈ సినిమాకు కథ అంటే ప్రత్యేకంగా చెప్పలేం. ఎందుకంటే వైఎస్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి కథ గురించి ప్రత్యేకంగా చెప్పలేం. పేద ప్రజల, రైతుల కష్ట నష్టాల గురించి తెలుసుకునేందుకు తన గడప దాడి స్వయంగా ప్రజల్లోకి వచ్చి వాళ్లతో మమేకమై.. వారి సమస్యలు తెలుసుకొని… ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా వైఎస్ పోరాట పటిమ గురించి తెలుపడమే ఇతివృత్తం. పాద యాత్ర తర్వాత వైయస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం… ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్, ఆయనకు ఎలా పేరు తీసుకొచ్చాయి… తిరిగి రెండోసారి సీఎం అవ్వడం.. అతరువాత అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే….హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వంటి విషయాలను కూడా చూపించారు.
నిజానికి ఇప్పటివరకు వచ్చిన బయోపిక్ లకు కాస్త డిఫరెంట్ బయోపిక్ అని చెప్పాచ్చు యాత్ర. ఈ సినిమా ముఖ్యంగా వైఎస్ అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే రాజకీయాలపై కాస్త ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి కూడా నచ్చేస్తుంది. వైఎస్ అభిమానులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వైఎస్ సన్నివేశాలను చాలా ఎమోషనల్ గా ప్రజెంట్ చేశాడు. వైఎస్ కి సంబంధించిన పొలిటికల్ సిచువేషన్స్ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సొంత పార్టీలో విపక్షాన్ని ఎదుర్కొని ఎలా మహానాయకుడుగా ఎదిగాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఇంకా వైఎస్ చేపట్టిన పలు సంక్షేమ పథకాల గురించి చాలా క్లియర్ గా చూపించారు. పాదయాత్ర నేపథ్యంలో కరెంటు ఛార్జీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం..ఈ కోవలోనే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలనే ఆలోచన వైయస్ఆర్‌కు రావడం వంటివి చూపించారు. మరోవైపు అనారోగ్యాల కారణంగా..ఆస్పత్రిలో ఫీజులు కట్టలేక బాధపడుతున్న ప్రజల కోసం ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలు, డబ్బులు కట్టలేక పెద్ద చదువులు చదవలేకపోయిన వారికోసం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశం పెట్టడంతో చిన్న, మధ్యతరగతి ప్రజలకు పెద్ద చదువులను దగ్గరచేయడం వంటివి చాలా ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. అంతేకాదు ఒకటి రెండు చోట్ల చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చేలా డైలాగ్స్ కూడా వాడాడు డైరెక్టర్. లాస్ట్ లో జగన్ స్పీచ్ తో సినిమాకు ఎండింగ్ టచ్ ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ మమ్ముట్టి అన్న విషయం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే అర్ధమైపోయింది. వైయస్.రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టి కాకుండా..వేరే నటుడిని ఊహించుకోవడం కష్టం అనే రేంజ్‌లో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు ఆయన. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి హావభావాలు, మొండితనన్ని తన నటనలో బాగా చూపించగలిగారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించి ఆకట్టుకున్నారు. వైఎస్ తండ్రి పాత్రలో జగపతి బాబు, ముఖ్యంగా కేవీపీ పాత్రలో రావు రమేష్ ఇంకా పలువురు నటీనటులు తమ పాత్ర మేర ఉన్నంతలో పర్వాలేదనిపించాడు.
సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే మొత్తంగా సినిమా వైఎస్ అభిమానులకు బాగానే నచ్చుతుందని చెప్పవచ్చు గాని మిగతా ఫ్యాన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.
ప్లస్ పాయింట్స్:
కథ
మమ్ముట్టి నటన
ఎమోషనల్ సన్నివేశాలు
[wp-review id=”15192″]
[youtube_video videoid=kvRa1mtUROo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: