అనుపమ పరమేశ్వరన్… చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా ఉండే రూపం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రూపంతోనే దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన ఈ కేరళ కుట్టి… తాజాగా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే… దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించడమే కాకుండా ఆ యా భాషల్లో మొదటి సినిమాలతోనే మంచి విజయాలను అందుకోవడం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అనుపమ తొలి మలయాళ చిత్రం `ప్రేమమ్` (2015) బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, మొదటి తెలుగు చిత్రం `అ ఆ` (2016) ఘనవిజయం సాధించింది. ఇక ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ `కొడి` (2016) కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అంతేకాదు… ఆమె తొలి కన్నడ చిత్రం `నటసార్వభౌమ` గురువారం (ఫిబ్రవరి 7) విడుదలై… హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పాత్ర… కథలో ఎంతో కీలకం కూడా. తన నటనతో కన్నడిగుల మనసు కూడా దోచేసిన అను… మొత్తమ్మీద తొలి చిత్రాల విషయంలో రేర్ ఫీట్‌ని సొంతం చేసుకున్నట్లయ్యింది. కంగ్రాట్స్ టు బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్ అనుపమ పరమేశ్వరన్!
[youtube_video videoid=agQsBk9espA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: