బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదన్న సంగతి కూడా విదితమే. గత ఏడాది రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్…ఈ ఏడాది వినయ విధేయ రామ లాంటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. అయితే సరైన టాక్ దక్కించుకోలేకపోయినా కలెక్షన్ల పరంగా కొన్ని చోట్ల మాత్రం బాగానే రాబట్టినా.. కొన్ని చోట్ల మాత్రం అంతంత మాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా క్లోజింగ్ కలెక్షన్స్ తరువాత చూసుకుంటే మాత్రం దర్శక నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా రిజల్ట్ పై ఎవరైనా మాట్లాడటానికి ముందుకొస్తారా..కానీ చరణ్ మాత్రం ఈ సినిమాపై స్పందిస్తూ తన అభిమానులకు ఓ లేఖను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినయ విధేయ రామ కోసం రేయింబవళ్లు కష్టపడిన సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు.. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీ దారులు మరియు ప్రదర్శనదారులకు కృతజ్ఞుడనై ఉంటాను..మీకు నచ్చేలా సినిమా తీయడం కోసం మేము ఎంతగానో శ్రమించాం…కానీ దురదృష్టవశాత్తు సక్సెస్ కాలేకపోయింది. మీరు చూపించే ప్రేమను ప్రేరణగా తీసుకొని ఇక ముందు మీరు మెచ్చే సినిమాలు చేసేలా కృషి చేస్తానని చరణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఈ లేఖతో చరణ్ మరో సంప్రదాయానికి తెర తీశారు.
#RamCharan honest confession about #VinayaVidheyaRama 👏👏#VVR pic.twitter.com/OcZ2JUdtai
— Suresh Kondi (@V6_Suresh) February 5, 2019
[youtube_video videoid=CG2prtM2O70]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: