ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో.. ఈశ్వర్, తుయా చక్రబోర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ అందించారు. ప్రేమ, పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది ఈ సినిమా ద్వారా చూపించనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈ సినిమాలో కౌసల్య, అన్నపూర్ణ, సుధ, సత్యకృష్ణ, విద్యుల్లేఖా రామన్, సురేష్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, గౌతంరాజు, అనంత్, వేణు, ధనరాజ్, తడివేల్, విట్టా మహేశ్ తదితరులు నటిస్తున్నారు. ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ సినిమాను దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=EGWZJk7v_c0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: