బాల నటుడిగా చిత్ర సీమ లో ప్రవేశించి, అనతికాలం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు నటించిన అనేక సినిమాలు ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నటనలో తన కంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూర్ వంటి మెట్రో పాలిటన్ సిటీస్ లోనే కాకుండా పంజాబ్ రాష్ట్రం లో మహేష్ బాబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ సినిమాలు చూసి పంజాబీలు మహేష్ బాబు కు అభిమానులయ్యారు. సినిమాలలో పోషించే పాత్రలను ఎంజాయ్ చేస్తూ మహేష్ పై అభిమానం పెంచుకున్నారు. మహేష్ బాబు నటించిన సినిమాలు పంజాబీ భాషలో డబ్బింగ్ చేయాలని మహేష్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. పంజాబీ భాషలో డబ్బింగ్ చేసిన సినిమాలు పంజాబ్ రాష్ట్రం లో ఎక్కువ థియేటర్స్ లో ప్రదర్శించే అవకాశంతో అభిమానులు, తమ అభిమాన నటుడి మూవీ ను తమ భాషలో వీక్షించే అవకాశం కలుగుతుందని వారి కోరిక.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: