సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను ఖుషీ చేసేస్తున్నాడు. కేవలం ఎనిమిది నెలల గ్యాప్‌లోనే `కాలా`, `2.0`, `పేట` చిత్రాలతో పలకరించి… ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఇదే ఊపులో… మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తలైవా. పాన్-ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా… మార్చి నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. ఇందులో రజనీ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు… ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 90 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ సినిమాలో రజనీకి జోడీగా కేరళ కుట్టి కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో ఈ ప్రెస్టేజియస్ మూవీని నిర్మించనుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు అందించనున్న ఈ సినిమా… ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: