నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `సింహా`, `లెజెండ్` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. దాదాపు ఐదేళ్ళ విరామం తరువాత వీరిద్దరి కలయికలో మరో చిత్రం రాబోతోంది. గత రెండు చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ బాలయ్యని పవర్‌ఫుల్ రోల్‌లో చూపించబోతున్నాడట బోయపాటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఏప్రిల్ నెలలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… మొదటి షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేశాడట దర్శకుడు బోయపాటి. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో… ఈ సీక్వెన్స్ షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. సహజంగా… బోయపాటి సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. మరి… ఫైట్ సీన్‌తోనే పట్టాలెక్కనున్న ఈ మూవీ నందమూరి అభిమానులను మరింతగా అలరిస్తుందేమో చూడాలి. కాగా… సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
[youtube_video videoid=xeXXbPfPuDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: