విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి` చిత్రాలకు ప్రత్యేక స్థానముంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలుగా రూపొందిన ఈ సినిమాల్లో వెంకీ కామెడీ టైమింగ్ ఆయన అభిమానులనే కాదు… సగటు ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ రెండు సినిమాలకు మరో కామన్ పాయింట్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషణలు. త్రివిక్రమ్ మాటలతో వెంకీ ప్రేక్షకులను భలేగా నవ్వించాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందంటూ ఆ మధ్య హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. అయితే… త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ తొలిసారిగా నటించనున్న ఈ సినిమా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా పూర్తవగానే వెంకీ కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. `ఎఫ్ 2`లో మరోసారి తన మార్క్ కామెడీతో అలరించిన వెంకీతో… అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట త్రివిక్రమ్. మరి మాటల రచయితగా వెంకీకి కలిసొచ్చిన త్రివిక్రమ్… దర్శకుడిగానూ మంచి విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=tqMGOiJEuYI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: