కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్‌ది దాదాపు 16 ఏళ్ళ సినీ ప్రస్థానం. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ టాలెంటెడ్ హీరో… ఈ 16 ఏళ్ళలో కేవలం 16 చిత్రాలకే పరిమితమయ్యాడు. అంతేకాదు… కెరీర్ మొత్తమ్మీద… 2003, 2007, 2015, 2018 సంవత్సరాల్లో మాత్రమే కళ్యాణ్ రామ్… ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే… ఈ ఏడాది మాత్రం కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా నాలుగు చిత్రాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడీ నందమూరి హీరో. అంతేకాదు… వరుసగా మూడు నెలల పాటు తన సినిమాలు విడుదలవుతుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇప్పటికే జనవరి నెలలో `యన్.టి.ఆర్. కథానాయకుడు` (తండ్రి హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్) కోసం తెరపై దర్శనమిచ్చిన ఆయన… ఫిబ్రవరి నెలలో ఆ సినిమా రెండో భాగం `యన్.టి.ఆర్. మహానాయకుడు`తో పలకరించనున్నాడు. ఇక మార్చి 1న యాక్షన్ థ్రిల్లర్ `118`తో థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇలా… వరుసగా మూడు నెలల పాటు తెరపై కనిపించనున్న కళ్యాణ్ రామ్… మార్చిలో పట్టాలెక్కి ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానున్న విరించి వర్మ కాంబినేషన్ మూవీతోనూ ఈ ఏడాది సందడి చేయనున్నాడు. మొత్తానికి… రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం నాలుగు సినిమాలతో కళ్యాణ్ రామ్ అభిమానులను మురిపించనున్నాడు. సో… 2019 కళ్యాణ్ రామ్ కి నెంబరాఫ్ సినిమాస్ పరంగా వెరీ వెరీ స్పెషల్ ఇయర్ అన్నమాట.
[youtube_video videoid=xeXXbPfPuDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























