ఘాజీ.. అంతరిక్షం లాంటి విభిన్నమైన కథలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ సినిమా మంచి ఘన విజయం సాధించగా… అంతరిక్షం సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అయినా కూడా సంకల్ప్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా మరో ప్రయోగానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈసారి కూడా మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం సంకల్ప్ రెడ్డి తదుపరి చిత్రం మంచు ఖండం అంటార్కిటికా నేపథ్యంలో ఉండబోతోందట. ఓ తెలుగు ఎక్స్ ప్లోరర్ అంటార్కిటికా వెళ్లడం…అక్కడ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ కావడం..ఆ తరువాత అక్కడ అతను ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=E310No_S-GY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: