ప్రస్తుతం ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. రీసెంట్ గా శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా..ఆ సినిమా కూడా ఆశించినంత సక్సెస్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం తను ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా టైటిల్ ను ఇప్పటివరకూ ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను ఓ స్పెషల్ డే రోజు ప్రకటించనున్నారు. స్పెషల్ డే అంటే ఏదో కాదు.. రవితేజ పుట్టిన రోజున. జనవరి 26 రిపబ్లిక్ డే అలాగే రవితేజ పుట్టిరోజు కూడా కావడంతో.. ఈసినిమా టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
కాగా ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఒక హీరోయిన్ కాగా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇక ఈ సినిమాతో పాటే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడనుందని సమాచారం. ఇక ఈసారి తప్పకుండా సక్సెస్ ను సాధించాలనే పట్టుదలతో వున్నాడు రవితేజ. మరి చూద్దాం ఈ సినిమాలు రవితేజ కు ఎలాంటి సక్సెస్ ను తెచ్చిపెడతాయో.
[youtube_video videoid=tTnZDLGpMro]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: