మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తరువాత చిరంజీవి స్టార్ డైరెక్టర్ శివ కొరటాల దర్శకత్వంలో చేయనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆతరువాత త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడంతో కొరటాల శివతో సినిమా ఉండటంలేదని, అది ఇంకా ఆలస్యం కానుందని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్లపై ఓ క్లారిటీ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ రాబోయే కొత్త సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయిందని.. ప్రస్తుతం కొరటాల కూడా ఇదే పనితో బిజీగా ఉన్నాడని.. రూమర్లు నమ్మద్దంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ కొణిదెల ప్రొడక్షన్స్. ప్రస్తుతం చిరంజీవి గారు సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.. ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత.. చిరు-కొరటాల సినిమా పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చారు. మరి దీంతోనైనా రూమర్లకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..
[youtube_video videoid=qqwQveU3DHA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: