తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎస్వీసీసీ (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్) అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#MrMajnu censored with U/A and no cuts. #MeetMrMajnu on 25th Jan.
A film by @dirvenky_atluri@AkhilAkkineni8 @AgerwalNidhhi @MusicThaman @ShreeLyricist @George_DOP @sonymusicsouth @svccofficial #MrMajnuOnJan25th pic.twitter.com/ocMKDD40YM— SVCC (@SVCCofficial) January 21, 2019
కాగా యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న… ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్ కు అయితే మంచి రెస్పాన్సే వచ్చింది.. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=9CY19BnsPoM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: