వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పొల్లాచ్చిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుండగా… ఈ వారం చివరితో అక్కడి షెడ్యూల్ పూర్తువుతుంది. దాని తరువాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ లో కూడా ముగిసిన తరువాత.. నెక్ట్స్ షెడ్యూల్ ను అబుదాబిలో చేయనున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అబుదాబి షెడ్యూల్ తో.. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని సమాచారం. మిగతా పనులన్నీ త్వరగా పూర్తి చేసుకుని ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా టీజర్ ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారన్న వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.
[youtube_video videoid=XSnFa0zqXRM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: