ఏడేళ్ళ క్రితం `వై దిస్ కొలవెరీ డీ` పాటతో యూ ట్యూబ్ సెన్సేషన్ అయిపోయిన అనిరుధ్… అనతికాలంలోనే తమిళనాట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తెలుగులోనూ డబ్బింగ్ అయిన కొన్ని తమిళ చిత్రాలు స్వరకర్తగా అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `అజ్ఞాతవాసి`తో తెలుగునాట కూడా కాలుమోపాడు ఈ మ్యూజిక్ సెన్సేషన్. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ`కి స్వరాలు అందిస్తున్నాడు అనిరుధ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కానున్న `పేట`కి కూడా అనిరుధ్‌నే స్వరకర్త. అంతేకాదు… సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో చేసిన మొదటి సినిమా కావడంతో… ఈ సినిమా ఫలితం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు అనిరుధ్. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… గత సంక్రాంతికి `అజ్ఞాతవాసి`తో పాటు తమిళ అనువాద చిత్రం `గ్యాంగ్`తోనూ పలకరించిన అనిరుధ్‌కి… ఆ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో… `పేట` అయినా ఆ లోటుని భర్తీ చేసి అనిరుధ్‌కి తొలి `సంక్రాంతి` హిట్‌ని అందిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=QflKrauKmEk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: