రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లైఫ్ లోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ అయిన తరువాత నుండి ఈ సినిమా ఉంటుందని ఆర్జీవీ సినిమా ప్రారంభించేప్పుడే చెప్పాడు. ఇక దీనిలో భాగంగానే ఇటీవల వెన్నుపోటు అంటూ సంచలనం సృష్టించారు రామ్ గోపాల్ వర్మ. మోసం..నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు..వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు…కుట్ర కట్ర.. అంటూ లిరిక్స్ తో వచ్చిన ఈ పాట పెద్ద చర్చలకే దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనాలే సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఎందుకు? అంటూ మరో పాటతో ముందుకొస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎందుకు? అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు వర్మ. మరి ఈ పాటతో ఏం సంచలం సృష్టిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు.
2nd song of #LakshmisNTR releasing today the 8th at 5 pm pic.twitter.com/w0h1xLY1D2
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2019
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ బయోపిక్ కు కౌంటర్ గానే ఈసినిమా తెరకెక్కుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమాలో వర్మ ఏ చూపిస్తాడో తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
Here’s a teaser trailer of Endhuku ? Song from #LakshmisNTR ..Full song releasing today at 5 PM pic.twitter.com/WctXXLNbpK
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2019
[youtube_video videoid=SCl4WNZpwKA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: