కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 289

Vijay Deverakonda To Share The Joy of Kushi with Rs.1 Lakh Each to 100 Families
సినిమా వార్తలు

100 ఫ్యామిలీస్ లిస్ట్ అనౌన్స్‌ చేసిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'ఖుషి' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. 100 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తానని కొన్నిరోజులక్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా సక్సెస్ ను తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని.. అలాగే 100 మంది పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా ఈ సంతోషాన్ని వారికి కూడా పంచుతానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన టీమ్ 100 కుటుంబాలను గుర్తించనుందని, త్వరలోనే వారి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఈరోజు దానికి సంబంధించి విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్…

Srikanth Mవాట్సాప్
MSMP Malayalam Grand release on Sep 15th
సినిమా వార్తలు

మళయాళంలోకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

నవీన్ పోలిశెట్టి ,అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని సూపర్ హిట్ అనిపించుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
nikhil hardwork for his swayambhu movie
సినిమా వార్తలు

స్వయంభూ టార్గెట్ దిశగా నిఖిల్ హార్డ్ వర్క్

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది ఇప్పటికే స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా కేవలం ఇప్పటివరకూ నిఖిల్ ఫస్ట్ లుక్ అలానే సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అవే సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Resumes Back on Sets For Ustaad Bhagat Singh
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. కొత్త షెడ్యూల్ స్టార్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్ట్ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ అభిమానులకు కావాల్సిన అన్ని మాస్ ఎలిమెంట్స్‌ ఉంటాయని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. భగత్‌.. భగత్‌ సింగ్‌.. మహంకాళి పోలీస్‌ స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ. ఈ సారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ గ్లింప్స్‌ వీడియోలో తనదైన మ్యానరిజంతో పవన్‌ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్ కి…

Srikanth Mవాట్సాప్
varun tej operation valentine movie dubbing work started
సినిమా వార్తలు

వరుణ్ ఆపరేషన్ వేలంటైన్ డబ్బింగ్ మిషన్ మొదలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఆపరేషన్ వేలంటైన్ అనే టైటిల్ ను…

TFN Adminవాట్సాప్
karthi dubbing starts for his japan movie
సినిమా వార్తలు

కార్తీ జపాన్ డబ్బింగ్ స్టార్ట్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
interesting update on sai pallavi bollywood entry
సినిమా వార్తలు

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ-స్టార్ హీరో కొడుకుతో సినిమా?

టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్‌, యాక్టింగ్ స్కిల్స్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఆ తరువాత పలు సినిమాలను చేసి లేడి పవర్ స్టార్ అని పిలిపించుకునే రేంజ్ కు ఎదిగింది. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్…

TFN Adminవాట్సాప్
nani hi nanna movie Musical Gala begins
సినిమా వార్తలు

హాయ్ నాన్న మ్యూజికల్ గాలా మొదలు

ఈ ఏడాది దసరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసినిమాలో నాని తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఈసినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకునే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
nikhil and naveen polishetty funny conversation about miss shetty mr polishetty movie
సినిమా వార్తలు

నిఖిల్-నవీన్ చిట్ చాట్ మామ సినిమా చూడలేకపోయా

పి. మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అనుష్క ఇంకా నవీన్ పోలిశెట్టీల నటన, వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాపై పలువురు సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ద్వారా స్పందించి అభినందించారు.

TFN Adminవాట్సాప్
Chota K Naidu Reveals Interesting Facts About Peddha Kapu-1 Movie
సినిమా వార్తలు

పెదకాపు-1 నా కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా - ఛోటా కె. నాయుడు

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విరాట్ కర్ణ ప్రధానపాత్రలో సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో సాలిడ్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి డివోపీగా పనిచేసిన స్టార్ సినిమాటోగ్రఫర్ ఛోటా కె. నాయుడు విలేకరుల సమావేశంలో…

Srikanth Mవాట్సాప్
Karthik Rathnam Interesting Comments on Hero Ravi Teja
సినిమా వార్తలు

నటుడిగా నాకు స్ఫూర్తి హీరో రవితేజ - కార్తీక్ రత్నం

సినిమాలపై ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త నటులందరికీ హీరోలు రవితేజ, నానిలే ఇన్స్పిరేషన్ అని, అలాగే తనకు కూడా నటుడిగా స్ఫూర్తి రవితేజ అని పేర్కొన్నాడు యువ నటుడు కార్తీక్ రత్నం. కేరాఫ్‌ కంచర్లపాలెం, నారప్ప చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం 'ఛాంగురే బంగారురాజా’. ఈ సినిమాకి నిర్మాత హీరో రవితేజ కావడం విశేషం. ఈనెల 15న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో కార్తీక్ రత్నం విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ కెరీర్ మరియు 'ఛాంగురే బంగారురాజా'కి సంబంధించి పలు విశేషాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
HanuMan Movie Promotions Will Start From Ganesh Chaturthi
సినిమా వార్తలు

ఆరోజు నుంచి 'హనుమాన్' మూవీ ప్రమోషన్స్ ప్రారంభం

ఒకప్పటి టాలీవుడ్ ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్, నేటి యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'హనుమాన్'. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తెలుగులో మొట్టమొదటి జాంబీ జోనర్‌గా చిత్రంగా తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ తర్వాత మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందంటూ పలువురు నెటిజెన్స్ కితాబునివ్వడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Salaar Movie Team Announces New Release Date Will be Revealed in Soon
రిలీజ్ అప్‌డేట్

సలార్‌ రిలీజ్‌పై కీలక అప్‌డేట్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీయఫ్ ఫేమ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న 'సలార్‌' సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి చిత్ర బృందం ప్రకటించిన మేరకు ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సలార్‌ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో వారు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
producer bhushan kumar gives clarity on prabhas spirit movie shoot
సినిమా వార్తలు

స్పిరిట్ షూట్ పై నిర్మాత క్లారిటీ

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అప్పటినుండి పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సింది కానీ ఇంకా పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. ప్రస్తుతం అయితే నాగ్ అశ్విన్ తో కల్కీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్.

TFN Adminవాట్సాప్
director bobby emotional post on power movie
సినిమా వార్తలు

9ఏళ్ల పవర్- బాబీ ఎమోషనల్ పోస్ట్

పవర్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన బాక్సాఫీస్ వద్ద తన పవర్ ను చూపించాడు డైరెక్టర్ బాబి. ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గానే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

TFN Adminవాట్సాప్
rajinikanth jailer movie top trending in some countries
ఓటీటీ

ఓటీటీలో జైలర్ హవా- పలు దేశాల్లో ట్రెండింగ్ లో

ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకి అటు అభిమానులకు జైలర్ సినిమా సూపర్ కిక్ ను ఇచ్చింది. ఈమధ్య కాలంలో వచ్చిన రజనీ సినిమాలు అన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాడు. రజనీ రేంజ్ కు తగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ కూడా పడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ ఆ కలను నిజం చేసింది. ఆగష్ట్ 10 వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైనే కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
ram skanda movie got sensational interests in book my show
సినిమా వార్తలు

స్కంద క్రేజ్-100K ప్లస్ ఇంట్రెస్ట్స్

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టైటిల్‌ గ్లింప్స్, టీజర్, పాటలు అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
jawan 5days collections
బాక్సాఫీస్

5వరోజు జవాన్ కు షాకింగ్ కలెక్షన్స్

వరుసగా నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా రాబట్టి రికార్డు సృష్టించిన జవాన్ సోమవారం కాస్త నెమ్మదించింది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 54కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అయితే నిన్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.ఆప్రభావం జవాన్ కలెక్షన్స్ ఫై కొద్దిగా పడింది.అయినా వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ చేయగలిగింది.ఓవరాల్ గా జవాన్ 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 574.89కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో నెట్ 280కోట్లు. ఈరోజుతో జవాన్ 300కోట్ల క్లబ్ లో చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
Miss Shetty Mr Polishetty: Special Screening For Ladies in AP and Telangana on Sep 14th
సినిమా వార్తలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. మహిళల కోసం స్పెషల్ మార్నింగ్ షో

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. గత వారం విడుదలైన ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని విజయవంతంగా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు అదేరోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా కూడా సత్తా చాటడం గమనార్హం. ప్రజెంట్ జెనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అలాగే అనుష్క శెట్టి…

Srikanth Mవాట్సాప్
pawan kalyan joins in UBS shooting
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్

బ్లాక్ బాస్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.ఇటీవలే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది.అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయిడు అరెస్ట్ నేపథ్యంలో హుటాహుటిన విజయవాడకు వెళ్లి రెండో రోజుల తరువాత పవన్ తిరిగి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నాడు.ప్రస్తుతం పవన్ మళ్ళీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.ఈషెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ లు రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్

షేర్